జగిత్యాల జిల్లాలో 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల

On
జగిత్యాల జిల్లాలో 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల

జగిత్యాల జిల్లాలో 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల
 జాబితాపూర్ ZPHS లో విద్యార్థుల దయనీయ పరిస్థితి 
 బహిర్భూమికి ఇంటికెళ్లాల్సిందే…

జగిత్యాల సెప్టెంబర్ 25 :

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 77 మంది విద్యార్థులున్నారు.

వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు.

వాటి స్థానంలో ఉపాధి హామీ కింద పాఠశాలకు ఒకటి చొప్పున రెండు మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతుండగానే అర్ధంతరంగా నిలిచిపోయాయి.

అప్పటి నుంచి రెండు పాఠశాలల్లో ఉన్న మొత్తం 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల గతి అయ్యింది. బహిర్భూమికి విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి..

Tags