పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తిర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

On

గొల్లపల్లి సెప్టెంబర్ 24 ప్రజా మంటలు

పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తిర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. 

 గొల్లపల్లి  మండలంలోని కేజీవీబి బాలికల ప్రభుత్వ వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల తరగతులను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన బోధనను  అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తిర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ సూచించారు.

చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. అనంతరం  పరిసరాలు కలియ తిరుగుతూ పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు.  పాఠశాల ఆవరణలో  ఉన్న డ్రైనేజీ వ్యవస్థను, పాఠశాల కాంపౌండ్ వాల్ ను పరిశీలించారు. నిల్వ ఉన్న డ్రైనేజీ నీరును ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ శానిటేషన్ చేయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ  కార్యక్రమములో బీసీ వెల్ఫేర్ సాయిబాబా, తాసిల్దార్ జమీరుద్దీన్ ,ఎంపీడీవో రామ్ రెడ్డి, ఎంఈఓ జమున దేవి, ఎంపీవో సురేష్ రెడ్డి, ఎస్ఓ పద్మ, కార్యదర్శి మధు ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags