అనాథలు, నిరాశ్రయులకు  261వ అన్నదానం  -మొబైల్ వైద్యశాలలు ఏర్పాటు చేయాలి 

On
అనాథలు, నిరాశ్రయులకు  261వ అన్నదానం  -మొబైల్ వైద్యశాలలు ఏర్పాటు చేయాలి 

అనాథలు, నిరాశ్రయులకు  261వ అన్నదానం 
-మొబైల్ వైద్యశాలలు ఏర్పాటు చేయాలి 
పద్మానగర్ సెప్టెంబర్ 22:
హైదరాబాద్ మహానగరంలో ఫుట్ పాతుల మీదనే జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారిని గుర్తించి ఆహారాన్ని అందించాము. అకాలవర్షాలకు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ  వివిధ రోగాల బారిన పడుతున్నారు.   ఈ అభాగ్యుల విషయంలో  మానవతా దృక్పధంతో ప్రభుత్వం అలోచించి, చొరవ తీసుకోని నగరంలో పలు మొబైల్ వైద్యశాలలను  ఏర్పాటు చేసి అనాథలు, నిరాశ్రయులు ఎక్కడ ఉంటే అక్కడే ఆరోగ్యపరీక్షలు చేసి ఔషధాలను అందించాలని  విజ్ఞప్తి చేస్తున్నాము.  ఈ 261వ అన్నదాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సేవ  సభ్యులు కుషికోమాల్, అఖిల్,  శుభం, రాజేశ్వర్ రెడ్డి  మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.

Tags