హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణం...బాత్రూంలో పసికందు మృత దేహం
పసికందు కు హాస్పటల్ కు సంబంధం లేదు... సూపరింటెండెంట్
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణం...బాత్రూంలో పసికందు మృత దేహం
-రోజుకో ఘటన చోటు చేసుకుంటున్న వైనం
-ఆడపిల్ల అని అబార్షన్ చేసి పడేశారా ?
ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ?
పసికందు కు హాస్పటల్ కు సంబంధం లేదు... సూపరింటెండెంట్
రంగంలోకి దిగిన పోలీసులు..
హుజురాబాద్, అక్టోబర్ 18 (ప్రజామంటలు):
రోజు రోజుకు సమాజంలో మానవత్వం మంటకలుస్తుంది.నవమాసాలు మోసిన ఓ కర్కశ తల్లి ఆడ శిశువని తెలిసి అబార్షన్ చేసుకొని బాత్రూం లో పడేసిందా..? లేక తల్లికి తెలియకుండా ఇతరులు అబార్షన్ చేసి పడేసారా? అంతుచిక్కని ప్రశ్న గా మారింది.
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో మొన్న గర్భిణీల ప్రసవ వేదన విషయం మరవకముందే.. మళ్లీ గురువారం రాత్రి ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది....వివరాల్లోకి వెళితే హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని బాత్రూంలో మృత శిశు లభ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మృతశిశువుకు బోడ్డు తాడు కూడా కట్ చేయకుండా పడేశారు. ఆస్పత్రిలోనే డెలివరీ అయిన మహిళ ఎవర్బాఅయిన్త్రూంఆ ఆ శిశువు మృతదేహాన్ని ఆస్పత్రిలో పడ వేశారా..? లేదా బయట వ్యక్తులు ఎవరైనా మృత శిశువును తీసుకొచ్చి బాత్రూంలో వేశారా..? అనేది తెలియాల్సి ఉంది...
ఈ విషయం తెలియగానే దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి సిసి ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పసికందు కు హాస్పటల్ కు సంబంధం లేదు... సూపరింటెండెంట్
ఈ విషయమై సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డిని వివరణ కోరగా మృత శిశువుకు ఎనిమిది నెలల వయసు ఉంటుందని అన్నారు. తమ ఆస్పత్రిలో డెలివరీ అయిన ప్రతి మహిళ, శిశువుల రికార్డు ఉంటుందని, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని బద్నాం చేసేందుకు బయట వ్యక్తులే మృత శిశువును తీసుకొచ్చి ఎమర్జెన్సీ వార్డులోని బాత్రూంలో వేసిఉంటారని తెలిపారు.
ఏది ఏమైనప్పటికి ప్రతిదీ కూడా ఆస్పత్రిలోని సీసీ కెమెరాలల్లో కనిపిస్తుందని, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు సమగ్ర విచారణ జరిపితే వెంటనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందిని స్థానికులు చర్చిస్తున్నారు.
-----±