ఐలమ్మ స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన. - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

On
ఐలమ్మ స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన. - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 24( ప్రజా మంటలు). 

పట్టణము చింతకుంట మిని ట్యాంక్ బండ్ వద్ద జగిత్యాల పట్టణం రజక సంఘం ఆధ్వర్యం లో కోఠి మహిళ విశ్వ విద్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిశేఖం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ .అంతకుముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ....

కోఠి మహిళ విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన ముఖ్యమంత్రి కి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

భూస్వాములు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వీర నారి ఐలమ్మ అన్నారు ఎమ్మెల్యే.

ఐలమ్మ పోరాటం నేటి మహిళలకు,సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కి ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తానన్నారు.

రైతు బిడ్డ,తెలంగాణ రాష్ట్రం,జగిత్యాల నియోజకవర్గం పై పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి సహకారం తో జగిత్యాల అభివృద్ధి సాధ్యం..

ఐలమ్మ స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి..

ఉద్యమ కారులు,పోరాట యోధులను తెలంగాణ రాష్ట్రంలో గౌరవించుకుంటం అన్నారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్ లు బాలే శంకర్, పంబాల రాం కుమార్,పద్మావతి పవన్,కప్పలశ్రీకాంత్,

రజీయుద్దీన్,కూతురు రాజేష్,సంఘం అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజ్ ఉపాధ్యక్షులు హనుమాన్లు కార్యదర్శి మరిపెళ్లి శ్రీనివాస్ నాయకులు దుమల రాజ్ కుమార్, పెద్దింటి రాజు ,భూమయ్య రమేష్, శ్రీనివాస్ ,సుమన్ రావు, గౌస్,గట్టు రాజు,కార్యవర్గ సభ్యులు నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

Tags