ఘనంగా ముద్దు రామకృష్ణయ్య 118 వ జయంతి వేడుకలు

On
ఘనంగా ముద్దు రామకృష్ణయ్య 118 వ జయంతి వేడుకలు

ఘనంగా ముద్దు రామకృష్ణయ్య 118 వ జయంతి వేడుకలు

జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు) :

జిల్లా కేంద్రంలోని వైశ్య భవనంలో ముద్దు రామకృష్ణయ్య 118 వ జయంతి వేడుకలు రామకృష్ణయ్య విద్యా సేవ సదన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు ,అభిమానులు పాల్గొని రామకృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామ కృష్ణయ్య చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సేవాసదన్ ప్రధాన కార్యదర్శి సూరజ్ శివ శంకర్ పెద్ది ఆనందం, దేవరశెట్టి జనార్ధన్ బాపురెడ్డి ,వెంకటరమణ, కనకతార ,నాగమణి, ఆనందం ,కైలాసం, శ్యాంసుందర్, లక్ష్మీకాంతరావు ,ప్రభాకర్, పిల్లి బాలకృష్ణ  సి.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags