తన దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన పొన్నం నారాయణ 

On
తన దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన పొన్నం నారాయణ 

తన దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన పొన్నం నారాయణ 

జగిత్యాల సెప్టెంబర్ 28:

పట్టణ 36వ వార్డు కు చెందిన రిటైర్డు టీచర్  పొన్నం నారాయణ గౌడ్ గారు (86) వారి మరణం అనంతరం వారి దేహాన్ని జగిత్యాల మెడికల్ కళాశాల కు అందిస్తామని డిక్లరేషన్ ఇవ్వగా వారిని వారి స్వగృహంలో సన్మానించి, భగత్ సింగ్ చిత్ర పటాన్ని అందజేసి  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు 
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
నారాయణ గౌడ్ మెడికల్ కళాశాల కి అవయవ దానం ఇవ్వడం అభినందనీయం అని,ఎంతో మందికి ఆదర్శం అని అన్నారు.ఎంతో మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసించడానికి,ఎనాటమీ తరగతులకు వారి దేహం చాలా ఉపయోగపడుతుంది అన్నారు.శరీర దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,నాయకులు టివి సత్యం ,చేట్పల్లి సుధాకర్,తొలిప్రేమ శ్రీనివాస్,పుణుగోటి భాను తేజరావు,రవి,సాకేత్,సాయి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags