పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పోస్టర్ ఆవిష్కరణ

On
పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పోస్టర్ ఆవిష్కరణ

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల అక్టోబర్ 21 (ప్రజా మంటలు) : 

పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం) 2013, కమిటీ పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ , ఇందులో భాగంగా డాక్టర్ బోనగిరి నరేష్ జిల్లా సంక్షేమ అధికారి , ఈ చట్టం గురించి వివరించడం జరిగింది.

అంతర్గత ఫిర్యాదుల కమిటీ : 

ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు.

ప్రొసీడింగ్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ లో పనిచేసే మహిళ ఉద్యోగి మహిళా చట్టాలు హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలి, మిగతా ఇద్దరు సభ్యులు ఎవరైనా ఆడ ,మగ ఆడవాళ్ళ చట్టాలు ,హక్కుల గురించి పనిచేసే ఎవరైనా ఉండాలి ,మిగతా ఒకరు ఏదైనా ఎన్జీవో సభ్యులుగా ఉండవచ్చు సగం సభ్యులు ఆడవాళ్లు ఉండాలి.

ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బాధిత మహిళ ఆ కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేసుకోవాలి.

స్థానిక ఫిర్యాదుల కమిటీ )

ప్రభుత్వం ద్వారా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయుటకు ఉండాలి, ఈ కమిటీ ఒక డిస్టిక్ ఆఫీసర్ ఉండాలి ఒక్క నోడల్ ఆఫీసర్ కలెక్టర్ లేదా మెజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్ అయి ఉండాలి , బాధిత మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత ఐసీసీ వాళ్లు ఇద్దరు వ్యక్తులకు అంటే, బాధిత మహిళలకు ఆరోపణ చేయబడిన వ్యక్తికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వారంలోపు ఏదైతే రాతపూర్వకంగా ఫిర్యాదు స్వీకరిస్తారో ఆరోపణ చేయబడిన వ్యక్తికి నోటీసు ఇస్తారు, లోకల్ కాంప్లీట్ కమిటీ ప్రతి ఆఫీస్ లో షో రూమ్స్ లో , బట్టల షాప్ లో ప్రతి చోట 10 మంది వర్క్ చేసే ప్లేస్ లో లోకల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలి అన్నారు, దీనికి సంబంధించిన ప్రచారం విసృతం గా చేయాలి అని చెప్పడం జరిగింది.

పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం) 2013,

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళల యొక్క హక్కులను స్వేచ్ఛను కాపాడుట కొరకు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను రూపుమాపడానికి స్త్రీ పురుషుల సమానత్వం సాధించడానికి, 2013 లో భారత ప్రభుత్వం మంత్రులచే నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం రూపొందించి ఆచరణలో తీసుకురావడం ఈ చట్టం యెుక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు ఆస్పత్రులు నర్సింగ్ హోంలు, విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు రవాణాతో ఉపాధి సమయం లో ఉద్యోగ ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి అవు తున్న అని భావించిన వారికి లన్ని కదా నుండి రక్షణ కల్పించడం.

బాధిత మహిళ యొక్క సమస్యలను ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు పరిష్కరించడానికి ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంటర్వ్యూ కంప్లైంట్ కమిటీ జిల్లా స్థాయిలో స్థానిక ఫిర్యాదుల కమిటీ లోకల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అని జిల్లా కలెక్టర్ సంక్షేమ అధికారి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ జిల్లా అదనపు కలెక్టర్లు పి.రాంబాబు మరియు బి.గౌతమ్ రెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు .

Tags