విద్యారంగ అభివృద్ధి పై తోడ్పాటునందించి ఆదర్శంగా నిలుస్తా. - ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్.వి. నరేందర్ రెడ్డి.

On
విద్యారంగ అభివృద్ధి పై తోడ్పాటునందించి ఆదర్శంగా నిలుస్తా. - ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్.వి. నరేందర్ రెడ్డి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు) : 

సమాజంలో విద్యావ్యవస్థను మార్చాల్సిన అవసరం ఎంతగానో ఉందని మరియు నూతన విద్యా విధానం ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు రావడానికి ఆస్కారం ఉందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్.వి. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానిక జగిత్యాలలోని ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో ఏర్పాటు చేసినటువంటి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాతకు పూజా ఆచరించారు.

మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషిచేసి ఉత్తమంగా ఉండాలని మరియు విద్యార్థులకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించి అగ్రగామిగా నిలవాలని,పట్టభద్రులకు అన్ని విధాలుగా చేయుతనిస్తానని మరియు వారికి అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. 

నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గానికి తోడ్పాటు అందించి వారి అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో ఉన్నానని ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో వారికి చేయూతనివ్వడమే కాకుండా కావలసినటువంటి సమకూర్చి ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సాహం అందిస్తానని తెలుపుతూ అందుకు అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ & అదిలాబాద్ నియోజకవర్గాల కేంద్రంగా ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభించి శిక్షణ ఇప్పిస్తూ వారిని ఉద్యోగాల వైపు పయనించే విధంగా కృషి చేస్తానని చెప్పారు.

  • గ్రంథాలయాలను ఇ-లైబ్రరీగా తీర్చిదిద్దుతానని మరియు
  • పాఠకులకు అన్ని రకాలుగా వసతులు కల్పించి వారికి చేయూతనిస్తానని ప్రకటిస్తూ
  • నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా పట్టభద్రుల అభివృద్ధి కై ముందుకు కొనసాగుతానని మరియు
  • ప్రభుత్వపరంగా వారికి అందే సహాయం కూడా వచ్చేటట్టుగా చేస్తానని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో చాలా వనరులు ఉండడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు సైతం చాలా ఉన్నాయని వాటన్నిటిని పట్టభద్రులందరు సద్వినియోగం చేసుకొని పటిష్టంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.

ఉద్యోగులకు సైతం కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కార్యక్రమాలను రూపొందించి కార్యచరణలను అమలు చేస్తామని తెలుపుతూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని చెప్పారు.

  • జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొలాస విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుకై కృషి చేయడంతో పాటు
  • సమీపంలోని కొండగట్టులోని జెఎన్టియు కళాశాలను విశ్వవిద్యాలయం హోదా వచ్చేందుకు ప్రయత్నిస్తానని మరియు
  • నూతన విద్యా విధానం ద్వారా విద్యా సంస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిబంధనలను సడలిచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలుపుతూ

విద్యా హక్కు చట్టం ప్రకారం ఇవ్వల్సిన ఉచిత విద్యను స్వాగతించాల్సిన విషయమని చెప్పారు.

  • ముఖ్యంగా డిగ్రీ కళాశాలల యజమాన్యాలకు బకాయిలుగా ఉన్న మూడు సంవత్సరాల ఉపకార వేతనాలను తను గెలిచిన తర్వాత విడుదలపై కృషి చేస్తానని చెప్పారు.

అదేవిధంగా

  • కోరుట్లలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో సౌకర్యాలు మెరుగుపరుస్తానని మరియు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
  • ఎయిడెడ్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు వచ్చే విధంగా కృషి చేస్తానని మరియు
  • మన స్కూల్లో టీచర్లకు ఎదురవుతున్న 010 చెల్లింపు విధానాన్ని అమలు చేసినందుకు ప్రణాళికను రూపొందిస్తానని తెలిపారు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశం మెరుగుపరచడంలో ప్రైవేటు ఉపాధ్యాయులు అందరికీ వారికి హెల్త్ కార్డు జారీ చేసే విధంగా చర్చలు జరుపుతామని చెప్పారు.

ముఖ్యంగా నేటి సమాజంలో పట్టభద్రులు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని నిర్ణయాత్మక పాత్రను పోషిస్తూ ప్రభుత్వాన్ని ఆలోచింపచేస్తుందని చెప్పారు.

అతి కీలకమైనటువంటి ఓటరు నమోదులో అర్హత కలిగిన పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని రానున్నటువంటి శాసనమండలి ఎన్నికలలో అభివృద్ధిని ఆకాంక్షించే విద్యాధికుడైన తనను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల నుంచి విచ్చేసిన యజమాన్యాలు, కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags