విద్యార్థులకు అండగా ఉంటాము  -జెడ్పి పూర్వ చైర్ పర్సన్ వసంత

On
విద్యార్థులకు అండగా ఉంటాము   -జెడ్పి పూర్వ చైర్ పర్సన్ వసంత

విద్యార్థులకు అండగా ఉంటాము      తక్షణమే విద్యార్థులకు టాయిలెట్స్ నిర్మాణం చేయాలి

-జెడ్పి పూర్వ చైర్ పర్సన్ వసంత

జగిత్యాల సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు) :

ఎమ్మెల్సీ కవిత  ఆదేశాలతో పాఠశాలను సందర్శించి విద్యార్థులు,ఉపాధ్యాయులతో మాట్లాడం జరిగిందని జెడ్పి పూర్వ చైర్పర్సన్  వసంత అన్నారు.

పత్రికలో వచ్చిన కథనం చూసి ఎమ్మెల్సీ కవిత చలించిపోయారన్నారు.

విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా నివ్వడం జరిగిందని,

పాఠశాలను సందర్శించి విద్యార్థులు,ఉపాధ్యాయులతో మాట్లాడం జరిగిందని

విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా నివ్వడం జరిగింది..

విద్యార్థులా పరిస్థితి చుస్తే హృదయం చలించిపోతుంది.

మన ఊరు - మన బడిని నిర్వీర్యం చేసి అమ్మ ఆదర్శ. పాఠశాలలుగా పేరు మార్చారు..


ఈ సందర్భంగా మాట్లాడుతూ:-

జాబితాపూర్ పాఠశాలలో 139 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ ఉండడం బాధాకరమన్నారు.

పత్రికలో వచ్చిన కథనం పై మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సి కవిత చలించి, విస్మయం చెందారు.

వెంటనే పాఠశాలను సందర్శించి, విషయాలు తెలుసుకోవాలని ఆదేశించారు.

కవిత ఆదేశాలతో  తాను నేడు జాబితాపూర్ జెడ్పి,ప్రాథమిక పాఠశాలలను విజిట్ చేయడం జరిగిందని,

కేసీఆర్ పాలనలో మన ఊరు మన బడి పేరుతో బృహత్తర పథకం తెరపైకి తెచ్చి,రూ. 27 వేల కోట్లు వెచ్చించి, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. 

మార్పు వస్తుందని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఊరు మన బడి పేరు మార్చారు.

ఇక్కడ అమ్మ ఆదర్ష పాఠశాల కింద టాయిలెట్ ల నిర్మాణం చేస్తామని ప్రకటించారు. 

తాను జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్నపుడే రూ. 10 లక్షలు నిధులు మౌలిక వసతుల కల్పనకు కేటాయించడం జరిగింది.

అమ్మ ఆదర్శ పాఠశాలకు జాబితాపూర్ స్కూల్ ఎంపికైందని పేర్కొన్నారు.

జెడ్పి నుండి తాము కేటాయించిన  నిధులు తిరిగి ఇచ్చివేయడం జరిగిందన్నారు.

కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు మాత్రం చేపట్టలేకపోయారు.

అడ పిల్లలకు రక్షణ కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టలేదు.

విద్యార్థుల పరిస్థితి చుస్తే హృదయం చలించిపోతుంది.

వ్యక్తిగత అభివృద్ధి కోసం కండువా పార్టీ మార్చి,నియోజకవర్గం అభివృద్ధి కోసం అని మాట్లాడ్డం విడ్డురం,

టాయిలెట్స్  లేక విద్యార్థులు,వాళ్ళ పరిస్థితిని చూసి పోషకులు ఆందోళన చెందే పరిస్థితి అన్నారు.

తక్షణమే జాబితాపూర్ లో పాఠశాల విద్యార్థులకు టాయిలెట్ లా నిర్మాణం చెప్పట్టాలని డిమాండ్ చేస్తున్నమన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు జలంధర్,రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు చిత్తారి శ్రీనివాస్,పడిగేల గంగారెడ్డి,లక్ష్మణ్,మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిత్తారి సురేష్,బిసి సెల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్,నాయకులు మహేష్,సంతోష్,సాగర్,ప్రణయ్,ప్రతాప్ ,సాయి తదితరులు పాల్గొన్నారు...

Tags