కుల సంఘాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

On
కుల సంఘాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 22(ప్రజా మంటలు) : 

కుల సంఘాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కన్వెన్షన్ హాలులో రెడ్డి జన సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ సూడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రెడ్డి కులస్తులు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..... రెడ్డి కులస్తుల లో అనేకమంది పేదరికంలోనే జీవిస్తున్నారని, వారిని ఆర్థికంగా ఆదుకోవడంలో ప్రభుత్వంతోపాటు మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు, బీదరికంలో ఉండి అనేకమంది విద్యకు దూరమవుతున్నారని ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే అన్ని రకాల అభివృద్ధి చెందుతారని ఉన్నత లక్ష్యాలతో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు.

గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా విద్యనభ్యసించడానికి తన వంతు కృషి చేస్తానని స్థలం చూడాలని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వెంకటరెడ్డిని ఆదేశించారు.

మొదటగా తన వంతుసాయంగా గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయడానికి జీవన్ రెడ్డి,లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

కరీంనగర్ సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.... రెడ్డి కులస్తులు గతంలో కంటే నేడు అన్ని రకాల వెనుకబడి ఉన్నారని విద్యాపారంగా ఉద్యోగ పరంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందజేసుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా రెడ్డి జనసంక్షేమ సంఘ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కొప్పెర వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిస్టంపేట రామచంద్రారెడ్డి, కోశాధికారి నేరెళ్ల భూమారెడ్డి తో పాటు కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులు నరసింహారెడ్డి, మైపాల్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , వైద్యులు శైలేందర్ రెడ్డి,సంఘ నాయకులు సంది తిరుపతిరెడ్డి రవీందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి మల్లారెడ్డి, రెడ్డి సంఘ సభ్యులు మహిళలు నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags