సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

On
సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

 సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

- కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

జగిత్యాల సెప్టెంబర్ 25:

 ప్రభుత్వ ఆసుపత్రిలో పెషేంట్లకు మెరిగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్బంగా కలెక్టర్ O.P. సేవలు, ఐపీ సేవలు ,రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్, ఐపీ, రికార్డ్స్ మెడికల్ ఫార్మసి కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగు పరచాలని, రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన  త్రాగునీరు అందిస్తున్నారా  అని తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని  సూచించారు.   

అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తీసేయించాలని, ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి శానిటేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట జగిత్యాల RDO మధుసుధన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags