జాబితాపూర్ గ్రామ మాజీ సర్పంచ్,కాంగ్రెస్ నాయకులు మారు గంగరెడ్డి దారుణ హత్య..

పాత కక్షల తోనే ఈ హత్య జరిగిందని అనుమానం.

On
జాబితాపూర్ గ్రామ మాజీ సర్పంచ్,కాంగ్రెస్ నాయకులు మారు గంగరెడ్డి దారుణ హత్య..

జాబితాపూర్ గ్రామ మాజీ సర్పంచ్,కాంగ్రెస్ నాయకులు మారు గంగరెడ్డి దారుణ హత్య
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ప్రధాన అనుచరుడు గా ఉన్న గంగ రెడ్డి., 

పాత కక్షల తోనే ఈ హత్య జరిగిందని అనుమానం.

(అంకం భూమయ్య)

జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు) :

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సొంత సోదరడుగా భావించే  జాప్తాపూర్ గ్రామానికి చెందిన మారు గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం  పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు గురి కావడం పట్టణం ఒకసారి ఉలిక్కిపడేలా చేసింది. ముందుగా నిందితులో వేరే కార్ లో వచ్చి మృతుని కార్ తో గుద్ది ఆపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చి వేరే కారులో పరారయ్యారు.

హత్య జరగడంతో జాబితాపూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు.

మొదటగా కార్ తో ఢీ కొట్టి అనంతరం కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో మృతి చెందాడని తెలిపారు

రౌడీ ల రాజ్యం గా మారిన జగిత్యాల 
ప్రాణభయం వెంటాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు 10 సంవత్సరాలుగా  ప్రతిపక్షం లో జెండ మోసిన కార్యకర్తల శవాల పై అదే కాంగ్రెస్  జెండ కప్పే పరిస్థితి నేడు జగిత్యాల నియోజకవర్గంలో  నెలకొందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు హత్యకు గురికావడంతో ఆయన ద్రిగ్భ్రాంతికి లోనయ్యారు. జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో  చేపట్టారు.

జీవన్ రెడ్డికి కుడి భుజం లాంటి మారు గంగారెడ్డి, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమకం కొరకు ప్రతిపాదనలు పంపారు.  పోలీసుల వైఫల్యం వలన గంగారెడ్డి హత్య జరిగిందని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్షలతో జరిగిన హత్యగా ఆరోపిస్తున్నారు అధికార పార్టీ కార్యకర్త హత్య జరగడం వెనుక ప్రతిపక్ష పార్టీ రాజ్యం, అధికార పార్టీలో నడుస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడుతున్నారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఇక పార్టీని కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.IMG-20241022-WA0402

Tags