కూతురు అంత్య క్రియలకు నోచుకోని "పోగుల రాజేశం"

జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి - మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు

On
కూతురు అంత్య క్రియలకు నోచుకోని

 కూతురు అంత్య క్రియలకు నోచుకోని "పోగుల రాజేశం".  జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి -

మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు

(చుక్క గంగారెడ్డి)

జగిత్యాల/సారంగపూర్ నవంబర్ 11: 

గత శుక్ర వారం వరకట్న దాహంతో హత్య గావించ బడ్డ పోగుల ( చంద) లత అంత్య క్రియలకు ఆమె తండ్రి పోగుల రాజేశం నోచుకోవడం లేదు. బిడ్డను కడసారి చూపు చూసుకోవాలని రాజేశంతో పాటు కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు. కోరుకోగా వారి ఆశలన్నీ అడియాశలు అవుతున్నాయి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగ్దల్ పూర్ జైల్ లో నిర్బంధించబడిన పోగుల రాజేశం విడుదల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

శుక్రవారం లత హత్యకు గురికాగా శవాన్ని తండ్రి కడసారి చూపు కోసం ఫ్రీజర్ లో భద్ర పరిచారు.  పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమార స్వామి, సీనియర్ జర్నలిస్ట్ అయిన తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి లు పోగుల రాజేశం భార్య పోగుల మల్లేశ్వరి తో కలిసి వెళ్ళి సోమవారం
 ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని జగ్దల్ పూర్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. జగ్దల్ పూర్ లోని ఎన్. ఐ.ఎ. కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.

IMG-20241111-WA0004

దీని కారణంగా మంగళ వారం ఉదయం: 9-30 గంటలకు రేచపల్లి లో లత అంత్య క్రియలు కన్న తండ్రి లేకుండానే జరగనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.


కాగా లత హత్య కేసు విషయంలో కూడా పలు అనుమానాలతో పాటు పోలీసుల దర్యాప్తు కూడా సరిగా లేనందున రీ - పోస్ట్ మార్టం కు అనుకూలంగా ఉండేందుకు శవాన్ని దహనం చేయకుండా ఖననం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

Tags