క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

On
క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

హైదరాబాద్ డిసెంబర్ 03:

దేశంలో ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబయ్, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ. 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

♦️ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా Hyderabad Rising ఉత్సవాలను హెచ్ఎండీఏ మైదానంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

♦️ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో పాటు పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ...

♦️దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను గమనించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, నదికి పునరుజ్జీవం చేయాలని సంకల్పించాం. వరదలొస్తే నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చింది. అందుకే నగరంలో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నాం.

♦️భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలి. అప్పుడే నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా నిలబడుతుంది.

♦️మనం బాగుపడటానికి ఎవరో వస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదలతో ముంచెత్తుతుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. నాలాల ఆక్రమణలను తొలగించాలి. మూసీని ప్రక్షాళన చేయాలి. పారిశ్రామిక కాలుష్యాలు మూసీలో కలవకుండా నియంత్రించాలి.

♦️చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న చోట ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుంది.

♦️రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే తెలంగాణకు మణిహారంగా 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించి 360 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డును చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

♦️రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు మధ్యన రేడియల్ రోడ్లు వేయడానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలిగితే తద్వారా 60 శాతం తెలంగాణను అభివృద్ధి బాటన పడుతుంది.

♦️ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూరగాయలు,   ఫ్రూట్ మార్కెట్, డెయిరీ, పౌల్టీ, మీట్ ప్రాడక్ట్స్ సదుపాయాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తాం.

♦️ముచ్చర్ల ప్రాంతంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగింది.

♦️రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయకతప్పదు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి.

♦️హైదరాబాద్ నగరమే మన ఆదాయం. ఆత్మగౌరవం. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

✅ Hyderabada Rising ఉత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు HMDA మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఆయా అభివృద్ధి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

✅ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో H-CITI ఫేజ్-1 లో ఇప్పటికే పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన రూ. 3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

✅ నగరంలో రహదారులు, వివిధ జంక్షన్ల సుందరీకరణకు రూ. 150 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.

✅ నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ. 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనుల ప్రారంభించారు. 

✅ రూ. 669 కోట్ల అంచనాలతో హైదరాబాద్ జల మండలి (HMWSSB) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు. 

✅ తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు ORR చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ. 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు.

✅ హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ. 1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు.

✅ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను  సీఎంగారు లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

Tags