గాంధీ విగ్రహానికి "చే "ఊత ప్రజా మంటలు కథనానికి స్పందన

స్పందించిన చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

On
గాంధీ విగ్రహానికి

గాంధీ విగ్రహానికి "చే "ఊత

ప్రజా మంటలు కథనానికి స్పందన

స్పందించిన  చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  

జగిత్యాల డిసెంబర్ 3 (ప్రజా మంటలు): 
జగిత్యాల జిల్లా కేంద్రంలో మంచినీళ్ల భావి వద్ద గల జాతిపిత గాంధీ విగ్రహానికి ఊత కర్ర కోల్పోవడంతో పాటు గాంధీ విగ్రహం ఎడమ చేతిని అగాంతకులు విరగగొట్టారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి సైతం చేతి విరగ్గొట్టగా  *ప్రజా మంటలు* తెలంగాణ జాతీయ దినపత్రికలో వార్త ప్రచురితమైంది.

Screenshot_2024-12-03-20-52-00-96_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

ప్రజాసంఘాలవారు పై ఘటనలపై నిరసన వ్యక్తం చేశారు కాగా జగిత్యాల పురపాలక సంఘం చైర్పర్సన్ అడువాల జ్యోతి స్పందించి, హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి మున్సిపల్ పక్షాన భిన్నమైన విగ్రహాలకు యధాపూర్వస్థితి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్నమాట నిలబెట్టుకొని విగ్రహాలకు పూర్వ రూపం కల్పించడానికి కృషి చేసిన చైర్పర్సన్ జ్యోతిని పలువురు అభినందిస్తున్నారు.

Tags