ఎన్నారైల విరాళాలతో పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ.
On
ఎన్నారైల విరాళాలతో పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ధర్మపురి డిసెంబర్ 02:
ఆస్ట్రేలియాలో ఉంటున్న వసుదేవ కుటుంబానికి చెందిన ఎన్నారైలు అందించిన విరాళాలతో ధర్మపురి లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో చదువుతున్న ఏడుగురు పేద విద్యార్థిని విద్యార్థులకు సోమవారం సైకిళ్ళును పంపిణీ చేశారు.
ఆస్ట్రేలియాలో ఉంటున్న ఎన్నారైలు పేద విద్యార్థులకు సాయం అందించాలని భావించి, జగిత్యాల కు చెందిన సామా ఉమాపతిని సంప్రదించి పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలని డబ్బులు పంపించారు. వాటితో ఆయన సైకిళ్లను కొనుగోలు చేసి ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ తో కలిసి సదరు విద్యార్థులకు పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags