లక్ష్మీపూర్ ఎంజేపీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
విద్యార్థినులు ఆందోళనతో అధికారుల చర్య
లక్ష్మీపూర్ ఎంజేపీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
విద్యార్థినులు ఆందోళనతో అధికారుల చర్య
గొల్లపల్లి నవంబర్ 16 ప్రజ మంటలు
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతి బాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మమతపై సస్పెన్షన్ వేటు పడింది.ప్రిన్సిపాల్ మమతను సస్పెండ్ చేస్తూ గురుకుల స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సైదులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉమ్మడి జిల్లా ఆర్సీఓ అంజలి తెలిపారు. రెండు రోజుల క్రితం లీవ్ పెట్టిన ప్రిన్సిపాల్ మమత లీవ్ లో ఉండి పాఠశాలకు హాజరైన సందర్బంలో ఆమె వ్యక్తిగత విషయానికి సంబంధించి గొడవ జరిగినట్లు ఆర్సీఓ తెలిపారు.
పాఠశాలలో జరిగిన ఈ గొడవకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు ఆర్సీఓ అంజలి, జిల్లా కోఆర్డినేటర్ సుష్మిత సంయుక్తంగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించారు. ఎంక్వయిరీ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సైదులు మమతను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా శనివారం మధ్యాహ్నం ఈ ప్రిన్సిపాల్ మాకు వద్దు అంటూ ఇదే ఎంజేపీ గురుకుల విద్యార్థినులు రోడ్డుపై ధర్నాకి దిగిన గంటల వ్యవధిలోనే ఉన్నతాధికారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.