జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర కుటుంబ సర్వే పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.     

On
జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర కుటుంబ సర్వే పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.     

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).                                           

జగిత్యాల నవంబర్ 11( ప్రజా మంటలు ) :                                 

సోమవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఎమ్మార్వోలు, ఎంపీడీవో, ఎంపీ ఓలు, సూపర్వైజర్లు, ఎంఈఓ ఇనిమరేటర్లతో సమావేశం నిర్వహించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..... మండల వారీగా జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రోజు వారి 15 నుండి 20 వరకు ప్రశ్న పత్రాలను వివరాలు కచ్చితంగా నమోదు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. సెలవు దినాల్లో కూడా ఎనీమరేటర్లు టీచర్ సర్వేలో పాల్గొని కచ్చితంగా వివరాలను నమోదు చేయాలని అలాగే ప్రశ్న పత్రాల ను బుక్లెట్ కోడ్ ఆదరితంగా ఫామ్ నింపాలని సూచించారు. సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ కు వెళ్తూ రోజు వారి ఎన్న్యుమరేటర్లతో ట్రాకింగ్ చేయాలని ఆదేశించారు. సర్వే ప్రశ్నపత్రం రోజువారి రిపోర్ట్ ను ఇప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు.

ప్రతి ఒక్కఅధికారి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొని సర్వేని విజయవంతంగా నిర్వహించాలని ఎవరైనా అధికారులు గాని టీచర్లు సూపర్వైజర్లు ఏన్నుమరేటర్లు గాని సర్వేలో పాల్గొనకుండా ఉంటే వారి పైన కఠిన చర్యలు తీసుకోబడునని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అలాగే కుటుంబ ఇంటి యాజమనులకు వాళ్లతో మాట్లాడుతూ కుటుంబ సర్వే వివరాలు గోప్యంగా ఉంచబడతాయని క్షేత్రస్థాయిలో వారికి తెలియజేయాలని తెలిపారు.                       

ఈ కార్యక్రమంలో,అదనపు కలెక్టర్,(లోకల్ బాడీస్) గౌతమ్ రెడ్డి , ఆర్డీవోలు, మధుసూదన్ , జివాకర్ రెడ్డి, శ్రీనివాస్,డిఇఓ జగన్మోహన్ రెడ్డి, డి ఆర్ డి ఓ, రఘువరన్, మున్సిపల్ కమిషనర్ , చిరంజీవి, జిల్లా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags