అంత్యక్రియల చార్జీల పెంపునకు ఉత్తర్వులు 

On
అంత్యక్రియల చార్జీల పెంపునకు ఉత్తర్వులు 

అంత్యక్రియల చార్జీల పెంపునకు ఉత్తర్వులు 

జగిత్యాల డిసెంబర్ 2:

ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు  మరణిస్తే ప్రభుత్వం ఇస్తున్న అంత్యక్రియల ఖర్చులను రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ.ఎమ్మెస్.నెంబర్.247 ద్వారా సోమవారం ఉత్తర్వులు జారీచేసిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.

మొదటి పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ ఉత్తర్వులను గత ప్రభుత్వం పదేళ్లు అయినా జారీ చేయలేదని,ప్రస్తుత ప్రభుత్వం అంత్యక్రియల ఖర్చులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తమ అసోసియేషన్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.

Tags