కొండగట్టు అంజన్న సేవలో సినీ నటుడు హీరో శ్రీకాంత్
On
కొండగట్టు అంజన్న సేవలో సినీ నటుడు హీరో శ్రీకాంత్
గొల్లపల్లి డిసెంబర్ 01 ప్రజా మంటలు
హీరో శ్రీకాంత్,నటుడు చంద్రకాంత్, నిర్మాత విజయ్ లు కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు వేదోచ్చరణ తో స్వాగతం పలికారు.
ఆలయ ఈఓ ఎం.రామకృష్ణ రావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ కార్తిక మాస చివరి ఆదివారం నేపథ్యంలో దర్శించుకున్నట్లు తెలిపారు. కార్తీకమాసం నేపథ్యంలో ఈ మాసం మొత్తం ఉపవాసం ఉన్నట్లు చెప్పారు.కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
వీరి వెంట ఏ ఈ ఓ వి అంజయ్య,పర్యవేక్షకులు గుండి హరిహర్నాథ్, సునీల్ ,ఉపాధ్యాయుల చంద్ర శేఖర్,టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్ ఉన్నారు.
Tags