లక్ష్మిపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్.

On
లక్ష్మిపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల రూరల్ నవంబర్ 16 (ప్రజా మంటలు) : 

లక్ష్మీపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శనివారం భోజన సమయంలో విద్యార్థినీలు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా బైఠాయించారు.

ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. విద్యార్థినీల ఆందోళనతో ఎట్టకేలకు అధికారులు దిగివచ్చారు.

చివరికి పాఠశాల ప్రిన్సిపల్ జీ. మమతను సస్పెండ్ చేస్తూ ఆర్ సీఓ అంజలి ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠశాలనుండి ఆటోలో సెక్యూరిటీ మధ్య ప్రిన్సిపల్ మమతను బయటకు పంపించారు పోలీసులు.

Tags