ఫలాలను ఇచ్చేది నదీ స్నానంగా భావించ బడుతున్న క్రమంలో ధర్మపురి

కార్తీక సోమవార ప్రత్యేకత:

On
ఫలాలను ఇచ్చేది నదీ స్నానంగా భావించ బడుతున్న క్రమంలో ధర్మపురి

సాంప్రదాయ రీతిలో కార్తీక సోమవార వేడుకలు
 (రామ కిష్టయ్య సంగన భట్ల)

కార్తీక మాసోత్సవ వేడుకల సందర్భంగా కార్తీక సోమవారం క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. కార్తీక మాసాంతర్గత పర్వదిన సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ అధికమైంది. కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతూ, ఈ మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం పురాణ పఠనం, శ్రవణం, దీపారారనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం కాగా, ప్రధానంగా వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది నదీ స్నానంగా భావించ బడుతున్న క్రమంలో ధర్మపురిIMG-20241111-WA0008 క్షేత్రానికి కార్తీక స్నానాల కోసం భక్తులు రావడం ఆనవాయితీ. 
కార్తీక సోమవార ప్రత్యేకత:

కార్తీక సోమవారం పర్వదినానికి ప్రత్యేకత ఈ ఉంది. శివునికి కార్తీక సోమవారం అత్యంత ప్రియ కర మైన దినం. జాతికుల రహితంగా ఈరోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానమాచరించి, శక్తికొద్దీ దాన ధర్మాలు చేసి, శివుని బిల్వ పత్రాలతో పూజించి, ఆభి షే షేకించి, అధమంగా రాత్రి నక్షత్ర దర్శన అనంతరం భజించి, భుజించి రాత్రంతా
జాగరణ చేసి, పురాణ శ్రవణం గావించాలని పురాణాలు స్పష్ట పరుస్తున్నాయి. సోమవారం శివపూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణుపూజ గావిస్తే వైకుంఠ ప్రాప్తి కలగగలదని స్కంద పురాణం చెపుతున్నది. సోమవారం శివాలయాలలో ఆవునేయితో, కొబ్బరి నూనెతో, అవిసె నూనెతో, విప్పనూనెతో అధమంగా ఆముదంతో దీపాలు వెలిగించాలని శాస్త్ర వచనం. ఈ నేపథ్యంలోనే నదీస్నానం, దైవ దర్శనార్థం భక్తులు క్షేత్రానికి ఆరుచెంచారు.

IMG-20241111-WA0009

ఉదయాత్పూర్వం నుండే పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, దైవ దర్శనార్థం దేవస్థానంలోని ప్రధానాలయాలకు తరలి వెళ్ళారు. వేకువ జామునే ఆలయాల అర్చకులు వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో పవిత్ర నదీ జలాలను తెచ్చి స్థానిక ఇలవేలుపులను అభిషేకించారు. ప్రధానాలయాలైన శ్రీయోగా నంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల, యమ ధర్మరాజు, ప్రసన్నాంజనేయ శ్రీరామ లింగేశ్వరాలయాలలో ఉదయం 5గంటల నుండి ప్రత్యేక ఆర్చనలు, పూజలు, అభిషేకాలు, కంకుమార్చనలు, నిత్య కళ్యాణాది కార్యక్రమాలను నిర్వహించగా, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు పాల్గొన్నారు.

IMG-20241111-WA0007

మొక్కులు తీర్చు కున్నారు. దేవస్థానంలోని ఉసిరిక వృక్షం వద్ద కార్తీక దామోదరునికి ఈసందర్భంగా ప్రత్యేక పూజలొనరించారు. భక్తిపార్శ్యంతో ముత్తయిదువలు ఉసిరిక చెట్టుచుట్టూ సనాత అచార ప్రకారం ప్రదక్షిణలు గావించారు. ఉసిరికలను దానం చేసుకున్నారు. విష్ణు అర్పణ కై వత్తుల దీపాలను వెలిగించారు. పవిత్ర గోదావరి నదీ జలాలలో రొప్పులలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెట్టారు. శ్రీరామలింగే శ్వర ఆలయంలో ప్రత్యేక చండి ప్రదక్షిణలు ఆచరించారు. పంచోపనిషత్ యుక్త వేదోక్త సాంప్రదాయసిద్ధ పూజలను నిర్వహించారు.

Tags