రైతులపై ఉన్న ఉద్యమ కేసులు వెంటనే ఎత్తివేయాలి
రైతులపై ఉన్న ఉద్యమ కేసులు వెంటనే ఎత్తివేయాలి
గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ ఉద్యమ కేసులు ఎత్తివేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా రైతు ఉద్యమ కేసులను ఎత్తివేయకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నదాని రైతులు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా భే షరతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమ కేసులను అన్నిటినీ ఎత్తివేయాలని రైతు ఉద్యమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కోరారు ఎకరాన సంవత్సరానికి 15వేలు రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తానని హామీ ఈ రబీ సీజన్ ప్రారంభం అయింది కాబట్టి వెంటనే విడుదల చేస్తే రైతులకు పెట్టుబడి సాయం ఉపయోగపడుతుందని రైతులు కోరుతున్నారు. మిగతా పూర్తి స్థాయి రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా పేరుతెచ్చుకోవాలని కోరారు. సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అమలుపరచాలని .ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి,కటిపల్లి గంగారెడ్డి,చింతలపల్లి గంగారెడ్డి, ఐలేని సాగర రావు,నేరెళ్ళ భూమరెడ్డి,జనార్దన్ రెడ్డి,మల్లయ్య,రాంరెడ్డి,గోపాల్ రెడ్డి,రత్నాకర్ రెడ్డి,శ్యాం సుందర్,నోముల గోపాల్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.