తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర మరవలేనిది - -  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

On
 తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర మరవలేనిది - -  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

 

తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర మరవలేనిది
-    -  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) :

 భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం, విమోచన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్రను పోషించింది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర మరువలేనిదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు.  హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించడంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని, ఈ ఖ్యాతి అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని బీజేపీ సహా ఇతర పార్టీల నాయకులు విమోచన, విలీనం విషయంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

విమోచన విలీనం చరిత్ర తెలియకుండానే బిజెపి నాయకులు ఇస్టారీతిన మాట్లాడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యే నాటికి బిజెపి పుట్టనే లేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోతున్నారని,  విమోచన విలీనం విషయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదని, చరిత్ర ఆధారంగా భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది. చరిత్రను ఎవరూ మార్చలేరని అన్నారు.

 భావి తరాలకు చారిత్రక వాస్తవాలు తెలిపాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఉంటుందని, రాజకీయాల కోసం చరిత్రను విస్మరిస్తే రాజకీయ పార్టీల ఉనికి గాని బిజెపి పరువు గాని బజారుపాలు అవుతుందమి, హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం, విమోచన అంశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కీలకమైన పాత్రను పోషించిందన్న చారిత్రక వాస్తవాన్ని ఎవరు కూడా మరిచిపోవద్దని చిన్నా రెడ్డి అన్నారు.

 

Tags