ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్.

On
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల రూరల్ నవంబర్ 28 (ప్రజా మంటలు) : 

మండలం బాలపల్లి గ్రామానికి చెందిన మెడపట్ల అంజలి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ,ఆర్థికంగా చికిత్స చేసుకోలేని స్థితిలో ఉండగా స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి సమస్యను తీసుకురాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల 75 వేల రూపాయల విలువగల LOC ని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో అంజలి కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.

జగిత్యాల పట్టణ 12 వార్డు ఉప్పరిపేట్ చెందిన మానుక మహేష్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా చికిత్స చేసుకొనే స్తోమత లేనందువలన విషయాన్ని స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి సమస్యను తీసుకురాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో మహేష్ కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.

ఈ కార్యక్రమంలో చెట్ పల్లి సుధాకర్,దు రాజ్ కుమార్,కథ్రోజ్ గిరి ,గుంటి రవి,ప్రవీణ్ రావు ,శ్రీనివాస్ రావు,గంగారెడ్డి,క్రాంతి,శ్రీకాంత్,శశి కుమార్,మేడపట్ల మల్లేశం,నర్సయ్య,తోట తిరుపతి,గంగరాజం రమేష్, సురేష్ గంగారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Tags