గ్రామీణ యువకుల శిక్షణ పేర కోట్ల రూపాయల నిదుల దుర్వినియోగం - చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వం – పాత బిల్లుల పేరిట కోట్ల నిదుల దండుకోలు

On
గ్రామీణ యువకుల శిక్షణ పేర కోట్ల రూపాయల నిదుల దుర్వినియోగం - చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వం – పాత బిల్లుల పేరిట కోట్ల నిదుల దండుకోలు

serpగ్రామీణ యువకుల శిక్షణ పేర కోట్ల రూపాయల నిదుల దుర్వినియోగం

కేంద్రం రద్దు చేసిన పథకం పని లేక కొనసాగుతున్న ఉద్యోగులు

చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వం – పాత బిల్లుల పేరిట కోట్ల నిదుల దండుకోలు

హైదరాబాద్ సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

శిక్షణా సంస్థలదే రాజ్యంగా, తెలంగాణలోని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఎంపాయ్మెంట్ జనరేషన్ మరియు మార్కెటింగ్ మిషన్(ఈ.జి.&ఎం.ఎం) లో దీనదయాల ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్ యోజన(డి. డి.యు. జి.కె.వి)  ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు పలువురు లబ్దిదారులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు చెవులు కోరుక్కొనటున్నారు.

దీనదాయల్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పటికీ, సంస్థ పరిపాలనాధికారి  చెప్పిందే వేదంగా,  శిక్షణా సంస్థల కనుసన్నల్లో  ఈ మిషన్  ను ఇతర సంస్థలో విలీనం చేయకుండా హైదరాబాద కేంద్రంగా ప్రభుత్వ నిధులను దుర్వినియవ్వగమ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  వివిధ సామాజిక మాధ్యమాలలో, టీవీలలో ఈ సంస్థ నిర్వాకం గురించి వార్తలు వచ్చినా, ప్రభుత్వంలోని పెద్దలు కానీ, మంత్రి కానీ పట్టించుకొక పోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని, 33 జిల్లాలో 64 మంది కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ మిషన్ కింద పని చేస్తుంటే, కేవలం హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ నందు 30 మందికి పైగా ఉద్యోగులు ఎలాంటి పని లేకుండా జీతాలు తీసుకొంటున్నారంటేనే సంస్థ పని తీరు అర్థం అవుతుంది.  అసలు  హెడ్ ఆఫీస్ నందు ఉన్న వారి విధులు ఏమిటో, ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు.

 ఈ సంస్థలోని ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు నెలల తరబడిగా ఆఫీస్ లో ఉన్నతాధికారి టేబుల్ పై ఉందట.  అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు uuద్యోగులకు సంబందించిన జితభత్యాల విషయంలో, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు అధికారితో నోట్ పైలు పెట్టుకొని ఆమోదించుకోవడం. లక్షల్లో జీతాలు, ఇతర అలవెన్సులు పెంచుకోవడం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఒక కాంగ్రెస్ నాయకుని అండతో గతకాలంలో ప్రైవేట్ శిక్షణా  సంస్థలకు అప్పటి ప్రభుత్వం చెల్లించని దాదాపు 38 కోట్ల నిధులు మంజూరీ చేయాలని కోరుతూ మంత్రి సీతక్కను కలిసినట్లు ప్రచారం జరిగినది.

గతంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మరియు మార్కెటింగ్ మిషన్ అనే సంస్థ సర్ప -ఐ కె పి లో భాగంగా uనదేది.  తర్వాత vvఈటీ కార్యకలాపాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటం కారణంగా దీనికై  ప్రత్యేకంగా ఒక ఐ ఏ ఎస్ స్థాయి  ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆధీనంలో కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత ఇంచార్జ్ ఈడీల ద్వారా సంస్థ కొనసాగిస్తున్నారు.

2000 నుండి స్వయం సహాయక గ్రూప్ కుటుంబాలలోని నిరుద్యోగ యువతకు మరియు గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, జాబ్ మేళాలను నిర్వహించి వివిధ రంగాలలో ఉపాధిని కల్పించే విధంగా ఈసంస్థ ఏర్పాటు చేశారు. కాని ప్రస్తుతం ఈ సంస్థ అనేక శిక్షణ సంస్థలు రాష్ట్రంలోనిర్వీర్యం అయిపోయి, కేంద్రం నిదుల విడుదల ఆపివేయగా, అసలు తూతూ మంత్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

జిల్లాలో ఏ సంస్థ కార్యకలాపాలు అసలు జరుగడంలేదు. జిల్లాలో ఉన్నకాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్, ఉద్యోగులు గ్రామీణాభివృద్ధి సంస్థ వారు అప్పజెప్పిన అన్ని పనులు చేస్తున్నారు. కొందరు డిప్యుటేషన్ మీద వెళ్లారు. కాని హైదరాబాద్ లోహెడ్ ఆఫీస్ నందు ఉన్న 30 మందికి పైగా ఎంప్లాయ్ లు ఏమి పనిలేకుండా లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉన్నారు. అసలు హెడ్ ఆఫీస్ సిబ్బంది చేస్తున్న పని ఏమిటో ఎవరికీ తెలియదు.

జిల్లాలో పనిచేస్తున్న అందరూ ఎంప్లాయిస్ కి ఉద్యోగ భద్రత, పే స్కేల్, ఇతర అలవెన్సులు ఇవ్వమని ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా కూడా,  హెడ్ ఆఫీస్ నందు ఉన్న ఉద్యోగులు మరియు అధికారులు అసలు పట్టించుకోలేదని, హెడ్ ఆఫీస్ నందు ఉన్న వారు ఎక్కువ జీతాలు తీసుకుంటూ, వాటికి అదనంగా అలవేన్సుల పేరుతొ లక్షల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, దీనితో చేసి, జిల్లాలో పని చేసే వారు నష్టపోతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఈ సంస్థను ఇతర సంస్థలో విలీనం చేయాలనే ప్రతిపాదన కొన్ని నెలలుగా సంస్థ ప్రధాన కార్యాలయ అధికారి టేబుల్ పై ఉన్నా, కొంత మంది సిబ్బంది వారి వ్యక్తిగత స్వలాభం చేజారిపోతుందని భావించి, ఏ వో తో చేతులు కలిపి,  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపకుండా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వమే గ్రామీణ కౌశల్ యోజన పథకాన్ని మూసివేసిన తరువాత, రాష్ట్రంలో ఈ సంస్థ చేస్తున్న పనులు ఏమిటో తెలియని పరిస్థితులలో ఈ సంస్థ ను కొనసాగించడంలో అర్థం లేదని, ఇందులోని ఉద్యోగులనే మరో ప్రభుత్వ సంస్థలో విలీనం చేయడమే శరీఆయినడాని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ఇన్నాళ్ళూ ఇచ్చిన శిక్షణ, లబ్దిదారుల కు సంబందించి పూర్తి విచారణ చేయాలని ఉద్యోగులు కోరుకొంటున్నారు.

 

Tags