అక్షయ ధరణి చిట్ ఫండ్ డైరెక్టర్ రంజన్ రెడ్డి అరెస్ట్...

సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి  

On
అక్షయ ధరణి చిట్ ఫండ్ డైరెక్టర్ రంజన్ రెడ్డి అరెస్ట్...

హనుమకొండ సెప్టెంబర్ 17 ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి ......

పచ్చిక శ్రీ రంజన్ రెడ్డి S/o బుచ్చిరెడ్డి, హనుమకొంIMG-20240913-WA0949 అను వ్యక్తి శ్రీ అక్షయ ధరిని చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకుని అందులో 25 లేదా 50 మంది చొప్పున చిట్టి సభ్యులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి, వారి వద్ద నుండి ఏజెంట్ల ద్వారా చిట్టి డబ్బులు వసూలు చేసి తన కంపెనీలో చిట్టి వేయండి ఒక సంవత్సరంలో ఇంట్రెస్ట్ తో సహా ఎక్కువ డబ్బులు ఇస్తామని మాయ మాటలు చెప్పగా, ఆ మాటలను నమ్మి 2018 సంవత్సరంలో ఆ చిట్ ఫండ్ కి బక్కి .దిగంబర రావు అను వ్యక్తి 10 లక్షలు మరియు 15 లక్షల రూపాయలు అలాగే అతని భార్య అయినా బక్కి. మంజుల పేరున 25 లక్షల రూపాయలు చిట్టిగా వేసి నెలవారీగా డబ్బులు చెల్లించినారు. దాంతో మొత్తం 50 లక్షల రూపాయలు కాగా 20 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా 30 లక్షల రూపాయలు మా చిట్ ఫండ్ నందు డిపాజిట్ చేయండి మీకు 18% ఇంట్రెస్ట్ తో ప్రతి నెల వాయిదాల రూపంలో చెల్లిస్తానని లేనిపోని ఆశలు కల్పించి అతడు చెప్పిన మాయమాటలను నమ్మి బక్కి. దిగంబర రావు మరియు అతని భార్య మంజుల పేరు మీద 30,00,000 రూపాయలను డిపాజిట్ చేసినాడు, ఇందుకు గాను పిర్యాధీకి మొత్తంగా 32,92,500 ఇవ్వ వలసి ఉంది, కానీ పైన తెలిపిన సంస్థ యజమాని కేవలం 16,70,625 రూపాయలు మాత్రమే చెల్లించినాడు, మిగతా 16,21,875 రూపాయలు ఇవ్వకుండా భక్కి దిగంబర రావు ను మరియు అతని భార్య మంజులను మోసం చేసినాడని ఫిర్యాదు అందగా సుబేదారి ఎస్సై శ్రీకాంత్ పచ్చిక నిరంజన్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినారు.IMG-20240913-WA0949IMG-20240913-WA0949

Tags