మార్షల్ ఆర్ట్స్ విద్య ను ప్రతి ఒక్కరు కచ్చితంగా నేర్చుకోవాలి  - సినీ నటులు సుమన్ 

On
మార్షల్ ఆర్ట్స్ విద్య ను ప్రతి ఒక్కరు కచ్చితంగా నేర్చుకోవాలి  - సినీ నటులు సుమన్ 

మార్షల్ ఆర్ట్స్ విద్య ను ప్రతి ఒక్కరు కచ్చితంగా నేర్చుకోవాలి 
- సినీ నటులు సుమన్ 
హైదరాబాద్ సెప్టెంబర్ 16:
ప్రస్తుత సమాజ పరిస్థితులలో మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సినీ నటుడు సుమన్ తెలిపారు.  సింధు తాపస్వి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 22 న జాతీయస్థాయి కరాటే, కుంఫు, టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సింధు తాపస్వి తెలిపారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖ బిజెపి నాయకులు చీకోటి ప్రవీణ్, నిర్వాహకులతో  కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మార్షల్ ఆర్ట్స్ విద్య అనేది ప్రతి ఒక్కరూ కచ్చితంగా నేర్చుకోవాలని అన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు మార్షల్ ఆర్ట్స్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ విద్య పై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం నిర్వాహకులు సింధు మాట్లాడుతూ.. ఈ ఛాంపియన్షిప్ పోటీలకు జాతీయస్థాయిలో 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు,సినీ నటులు సుమన్, టైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి లు హాజరవుతారని తెలిపారు.
Tags