పదవ తరగతి పరీక్షల సన్నాహక సమావేశం.

100% ఉత్తీర్ణత కై కార్యాచరణ రూపొందించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

On
పదవ తరగతి పరీక్షల సన్నాహక సమావేశం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 జగిత్యాల సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు )

జిల్లా కలెక్టర్ మీటింగ్ హాల్లో శుక్రవారం, 2025 మార్చిలో జరగబోయే పదవ తరగతి పరీక్షల సన్నాహక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధ్యక్షతన జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల విద్యాధికారులకు, నోడల్ అధికారులకు,రెసిడెన్షియల్ పాఠశాల కోఆర్డినేటర్లకు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయు లతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.....

రాబోయే ఎస్ఎస్సి పరీక్షల్లో 100%ఉత్తీర్ణత సాధించేందుకు కావలసిన కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని, అందుకుగాను ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు , ఎంఈఓ లు అందరూ కృషి చేయాలని కోరారు.

ముందుగా అన్ని పాఠశాలలో పదవ తరగతి లో చదువులో వెనుకబడిన విద్యార్థులు అందరిని గుర్తించి రాబోయే ఏడు నెలలు వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాద్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ విద్యార్థులందరికీ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, చదవడం, రాయడంలో శిక్షణ ఇచ్చి వారు ఉత్తీర్ణత సాధించే విధంగా తోడ్పడాలని కోరారు.

జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల యొక్క చదవడం రాయడంపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి రాబోయే పదవ తరగతి పరీక్షల్లో 100% గుణాత్మక ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరినారు.

ఈ సమావేశంలో క్వాలిటీ కోఆర్డినేటర్ కొక్కుల రాజేష్ ,మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల రీజనల్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.

Tags