జగిత్యాల మాత శిశు కేంద్రం ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

On
జగిత్యాల మాత శిశు కేంద్రం ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) : 

రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.

గురువారం రోజున జగిత్యాల లోని మాత శిశు కేంద్రాన్ని ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు.

ప్రతి రోజు ఎన్ని ఓ.పి.లు చూస్తున్నారు అని డేటానీ అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వైద్య సేవలను, ఆసుపత్రిలోని ఎమర్జె కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఓపి సేవలను నిరంతరం గా అందుబాటులో ఉంచాలని సూచించారు.

డాక్టర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి అని ఆదేశాలు ఇచ్చారు.ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు, శుభ్రమైన మంచినీరు అందిస్తున్నారా, వైద్యులకు సూచించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషేంట్లకి ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను పాటించాలని ఇంచార్జీని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags