అనాథలు, నిరాశ్రయుల కోసం 267వ అన్నదాన కార్యక్రమము

On
అనాథలు, నిరాశ్రయుల కోసం 267వ అన్నదాన కార్యక్రమము

అనాథలు, నిరాశ్రయుల కోసం
267వ అన్నదాన కార్యక్రం
సికింద్రాబాద్ డిసెంబర్ 22:
రాజధాని హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలలో  రోజు రోజుకు నిరాశ్రయుల సంఖ్య పెరుగుతుంది.  ఆశ్రయం కరువై ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన ఫుట్ పాత్ల మీదనే దయనీయ స్థితులలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.  అభాగ్యులందరికి ఆశ్రయం కల్పించి ఆహారం, వైద్యం అందించి కుటీర పరిశ్రమలలో శిక్షణ అందించి స్వయంఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి  స్కై ఫౌండేషన్ తరపున  విజ్ఞప్తి  చేస్తున్నాము.  హైదరాబాద్ నగరంలో వాహనంలో సంచరిస్తూ ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారిని గుర్తించి  267వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ అన్నదాన కార్యక్రమములో ప్రెసిడెంట్  వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పావని.ఓ, సేవసభ్యులు నేహా ఆఫ్సారి, అఖిల్, ఇఫ్రాన్  తదితరులు పాల్గొన్నారు.
Tags