తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

On
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం
హైదరాబాద్ నవంబర్ 30:
 
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గాఐఏఎస్  అధికారి
బుర్రా వెంకటేశం ను నియ‌మించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బుర్రా వెంకటేశం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప‌నిచేస్తున్నారు.
 
డిసెంబర్ 3వ తేదీతో ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియ‌నున్న విష‌యం తెల్సిందే.ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 

నవంబర్ 20వతేదీతో ప్రక్రియ పూర్తి అయింది.  ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ, ఈ దరఖాస్తులను పరిశీలించి బుర్రా వెంకటేశం పేరును ఖరారు చేసింది. నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రానున్న టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్‌ ముందు ఎన్నో స‌వాళ్లు ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఫెండింగ్‌లో ఉన్నాయి. బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్​గా దాదాపు నాలుగు నుంచి ఐదేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.

జనగామ బిడ్డ

బుర్రా వెంకటేశం తెలంగాణ‌లోని జనగామ జిల్లాలో జన్మించారు.ఈయ‌న‌ 1995 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయ‌న రాజ్‌భవన్ సెక్రటరీగా ఉండటంతో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Tags