ఐజేయు అనుబంధ సంఘాల నాయకులను సత్కరించిన ఎమ్మెల్యే.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 2 (ప్రజా మంటలు) :
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజెయు) రాష్ట్ర సోషల్ అండ్ డిజిటల్ మీడియా కమిటీ సభ్యుడిగా నియామకమైన జగిత్యాల పాత్రికేయులు టివి సూర్యం, జర్నలిస్టుల పై దాడుల వ్యతిరేక కమిటీ సభ్యుడిగా నియామకం అయిన ముజాహిద్ ఆదిల్ ను గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం తన నివాసంలో శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, పాత్రికేయులు రాజేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సంపూర్ణ చారి, వేణుగోపాల్, అంజయ్య, జహీర్, హరికృష్ణ, సులేమాన్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags