ప్రజా గొంతుకగా నిలుస్తా! ఎమ్మెల్సీ కోదండరాం
On
ప్రజా గొంతుకగా నిలుస్తా! ఎమ్మెల్సీ కోదండరాం
కరీంనగర్లో ఎమ్మెల్సీ కోదండరాం కు ఘన సన్మానం
కరీంనగర్ సెప్టెంబర్ 30:
నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకమై కరీంనగర్ కు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం కు ఘనంగా పౌర సన్మానం జరిగింది. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా, విద్యార్థి, ఉద్యోగ,ఉపధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటుందని, తాను ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్టులు పెండింగ్ లో వున్న తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధిపతి నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంగం నరహరి జగ్గారెడ్డి, గోపాల్ రెడ్డి, టి జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు, తెలంగాణ జన సమితి నాయకులు బి.వెంకటమల్లయ్య, మార్వాడీ సుదర్శన్, రమణారెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఫయాజ్, జునేద్, సయీద్,కోటేశ్వర్, సదానంద్, తెలంగాణ జన సమితి నాయకులు అరికిల్ల స్రవంతి, మోరె గణేశ్, కర్రె సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags