మండల విద్యాధికారిణిని సన్మానించిన "ట్రస్మా" నాయకులు

మండల విద్యాభివృద్ధికి కలిసి రావాలి - మండల విద్యాధికారిణి సునీతరాణి

On
మండల విద్యాధికారిణిని సన్మానించిన

ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

భీమదేవరపల్లి డిసెంబర్ 20 (ప్రజామంటలు)  :

ఇటీవల భీమదేవరపల్లి మండల విద్యాధికారిణిగా బాధ్యతలు చేపట్టిన సునీతారాణిని మండల "ట్రస్మా" నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సునీత రాణి మాట్లాడుతూ, ప్రభుత్వ నియమాలను పాటిస్తూ, పాఠశాలలను నడిపించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యాభివృద్ధికి కృషి చేస్తూ, మండలాన్ని ప్రథమ స్థానములో నిలపాలని సూచించారు. అనంతరం కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ, నూతనంగా మండల విద్యాధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన సునీత రాణిని మర్యాదపూర్వకంగా కలిసి, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం తమ పాఠశాలలో నడిపిస్తూ, విద్యారంగానికి తమ వంతు సేవను అందిస్తూ ముందంజలో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో "ట్రస్మా" మండల బాధ్యులు కొండబత్తిని రాజేశం, బేరే యాదగిరి, దస్తరి ఉమామహేశ్వర్, చెప్యాల గోపాల్ రెడ్డి, కొండబత్తిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.