జగిత్యాల నియోజకవర్గం బిజెపి బూత్ అధ్యక్షు లను సత్కరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు) :
బిజెపి సంస్థాగత పర్వం (2024) కార్యక్రమంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల పట్టణంలో బూత్ అధ్యక్షులుగా ఎన్నికైన దూరిశెట్టి మమత (191), మేడిపల్లి పుష్ప రెడ్డి (142) అధ్యక్షులు మరియు బూత్ ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన వారికి బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు తో కలిసి అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు రాగిళ్ల సత్యనారాయణ, యాదగిరి బాబు, పట్టణ ఉపాధ్యక్షులు గదాసు రాజేందర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు మామిడాల రాజుగోపాల్, కాశెట్టి తిరుపతి, బూత్ కమిటీ సభ్యులు నాయకులు తదితరు పాల్గొన్నారు.