లష్కర్ జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు -హెచ్ యు జే నాయకుల ప్రకటన
లష్కర్ జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు
-హెచ్ యు జే నాయకుల ప్రకటన
సికింద్రాబాద్ డిసెంబర్ 01 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ ఏరియాలో వివిధ పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులను హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్( HUJ - TWJF) ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నామాల గుండు బిఎన్ఆర్ గార్డెన్ లో ఆదివారం జరిగిన జర్నలిస్టుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. సరైన వైద్య సదుపాయం లేక అనేకమంది జర్నలిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను హెల్త్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. జర్నలిస్టులు తమ హక్కుల సాధన, మునుగడ, అభివృద్ధికి సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
సమాజ హితం కోసం
తమ కళాన్ని, గళాన్ని వినియోగిస్తూ ఎన్నో సమస్యలకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తి పరమైన నైపుణ్యాలను పెంచుకుంటూ వ్యవస్థ పరిరక్షణ కోసం జర్నలిస్టులు కంకణబద్దులు కావాలని ఆకాంక్షించారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చెల్లుబాటు అయ్యేలా జర్నలిస్టులకు హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రశేఖర్, నాయకులు బ్రహ్మానందం, రమేష్ వాల్మీకి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మామిడి సోమయ్య, బి. బసవ పున్నయ్య, హెచ్ యు జే అధ్యక్ష కార్యదర్శులు బి అరుణ్ కుమార్, బి జగదీశ్వర్, కోశాధికారి బి రాజశేఖర్ తో పాటు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బిజెపి నాయకులు మేకల సారంగపాణి, సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
-------