8 వార్డ్ గోత్రాల కాలనీ లో కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు) :
8 వార్డు గోత్రాల కాలనీలో 5 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ... 8వ వార్డు దరూర్ ,మోతే అనుబంధ ప్రాంతాన్ని జగిత్యాల పట్టణం లో మున్సిపల్ లో కలపడం జరిగింది.
జగిత్యాల పట్టణ అభివృద్ధి కి కృషి చేస్తా...
పట్టణ పారిశుధ్యం,పచ్చదనం లో ప్రజల భాధ్యత తప్పనిసరి..
చెత్త బండికి తడిపొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి..
హామీలి కార్మికుల కోరిక మేరకు త్వరలోనే గోధాం నిర్మాణం చేపడతామన్నారు. 8వ వార్డులో దాదాపు 2 కొట్లవరకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
సంఘం భవనాలు,పాఠశాల కు,రోడ్లు,డ్రైనేజీ లు,ఇతర పనులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
పట్టణ మాస్టర్ ప్లాన్,లె ఔట్ తగినట్లుగా నిర్మాణాలు చేపట్టాలి ప్రజలు సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి సహకారం తో జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య, నాయకులు గోపి, ఆవారి గంగాధర్,రమేష్,కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్,కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.