ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచన.

On
ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. -  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు) : 

నేర విచారణ, నేర నిరూపణ సమర్థవంతంగా చేయడం ద్వారానే నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడే అవకాశం ఉంటుందని, చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

 జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.... ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.

జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లు ఫ్లేక్స్ లు ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించే నిబంధనను అమలు చేయాలని సూచించారు.రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు.

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ యొక్క సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు , డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చంధర్, రాములు , మరియు ఎస్ బి, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు ఆరిఫ్ అలీ ఖాన్, రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు రామ్ నరసింహారెడ్డి, రవి, నిరంజన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సురేష్ మరియు ఎస్.ఐ లు,. డి సి ఆర్ బి , ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags