అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి. 

On
అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి. 

అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి. 
     -దావ వసంతసురేష్ 

జగిత్యాల అక్టోబర్ 1 (ప్రజా మంటలు )
 జిల్లాలో శానిటేషన్ నిర్లక్ష్యంతో విజృంభిస్తున్న విషజ్వరాలపై  బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
 వసంత సురేష్ మాట్లాడుతూ
తొమ్మిది నెలలు పూర్తయినా ప్రభుత్వం పాలన మెరుగు పడలేదని
రాయికల్ మండలం అల్లీపూర్ లో 11 ఏళ్ల చిన్నారి జ్వరంతో బాధ పడుతూ చనిపోయిన ఘటన కలిచివేసిందన్నారు.

 జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రభలుతున్న ప్రాణాలు పోతున్న ప్రభుత్వం, అధికారులకు పట్టడం లేదు.
డెంగ్యూ పాజిటివ్ లు వచ్చిన వైద్యులు కనీసం అందుబాటులో ఉండడం లేదని
బ్లీచింగ్ పౌడర్ కు బదులు సున్నం చల్లుతూ మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చీమ కుట్టినట్లు లేదు.
 కేసీఆర్ పాలన లో సీజనల్ వ్యాధులపై విస్తృతంగా శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
వానకాలం సీజన్ ముగిసిన రైతు భరోసా అందలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు.
విత్తనం పెట్టి చేతికి వచ్చే టైం వచ్చిన కనీసం సౌకర్యాలు అందడం లేదన్నారు
ఇచ్చినా హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారు.

 మహాలక్ష్మి, విద్యా భరోసా, ఫీజు రియాంబర్స్ మెంట్ విడుదల కాలేదని అరు గ్యారంటీ లు ఒక్కటి అమలు కాలేదన్నారు.
 పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్క ని విజ్ఞప్తి చేస్తున్న. మా పల్లెల దుస్థితి పై సమీక్ష చేయాలన్నారు.

 పథకాలు అమలు చేయకున్నా ప్రాణాలను కాపాడండి. శానిటేషన్ ని నిర్వహించండన్నారు.
 అధికారులు ప్రజలకు సేవకులుగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్,అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్,మాజీ జెడ్పీటీసీ మహేష్,పట్టణ ప్రధానకార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం,మాజీ  ఏ ఎం సి చైర్మన్ శీలం ప్రియాంకప్రవీణ్,రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగేల గంగారెడ్డి,ఆనంద్ రావు,కౌన్సిలర్లు సమీండ్ల వాణిశ్రీనివాస్,శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగేపు ముత్తు,అర్బన్ మండల యూత్ అధ్యక్షుడు సన్హిత్ రావు,రూరల్ మండల యూత్ అధ్యక్షుడు సదానందం,ప్రధాన కార్యదర్శి బాలే చందు,పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు ప్రణయ్,సెక్రటరీ నీలి ప్రతాప్,భగవాన్ రాజ్,రాయికల్ పట్టణ అధ్యక్షుడు అనిల్,మండల మహిళా అధ్యక్షురాలు స్పందన,రాయికల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు బర్కం మల్లేష్,కొల్లూరి వేణు,దొంతి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Tags