గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

- జిల్లావ్యాప్తంగా 580 మంది పోలీసు అధికారులు, సిబ్బందిచే పటిష్ట బందోబస్తు

On
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) :

స్థానిక బి ఎల్ ఎన్ గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

నిమజ్జనం ఉత్సవం సందర్భంగా ప్రజలు ఎక్కువగా రావడం జరుగుతుందని వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

నిమజ్జనోత్సవానికి భద్రతపరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 580 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిచే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రశాంత నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని కోరారు.

పోలీస్ అధికారులు మరియు సిబ్బంది బందోబస్తు కేటాయించిన ప్రాంతం పై పూర్తి అవగాహన మరియు చేయవలసినటువంటి డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు. డ్యూటీ ప్రదేశం నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళకూడదు అని డ్యూటీ పరంగా లేదా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పీలు రఘు చందర్ రవీంద్ర కుమార్ రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, రామ్ నర్సింహారెడ్డి, రవి, కృష్ణారెడ్డి, మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.