జగిత్యాల ప్రెస్ క్లబ్ గణపతి వద్ద ప్రముఖుల ప్రత్యేక పూజలు. - అన్న ప్రసాదం వితరణ. 

On
జగిత్యాల ప్రెస్ క్లబ్ గణపతి వద్ద ప్రముఖుల ప్రత్యేక పూజలు. - అన్న ప్రసాదం వితరణ. 

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు)

ప్రెస్ క్లబ్ నూతన భవనంలో ఏర్పాటుచేసిన గణేశునికి పలువురు ప్రముఖులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్, డీఎస్పీ రఘు చందర్, టౌన్ సిఐ వేణుగోపాల్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, నాయకులు గాజుల రాజేందర్, కూసరి అనిల్, జగన్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు ఏసీఎస్ రాజు, తపస్ జిల్లా అధ్యక్షులు బోనగిరి దేవయ్య,వొల్లం మల్లేశం తదితరులు గణేశుని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

బుధవారం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి పత్రిక మిత్రులు ఊటూరి నవీన్ కుమార్ సహకరించారు.

అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పట్టణ ప్రజలు, పాత్రికేయులు పాల్గొన్నారు.

అన్న ప్రసాద వితరణకు సహకరించిన ఊటూరి నవీన్ కుమార్ కు పాత్రికేయ బృందం పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

Tags