తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు) :
హైదరాబాద్ లో తెలంగాణ డిజిటల్ అధికారుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ను నియమిస్తూ టి జి ఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసారు.
కాగా సంతోష్ కుమార్ నియమితులైన సందర్భంగా టి జి ఓ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కందుకూరి రవి బాబు, కార్యదర్శి మామిడి రమేశ్, కరీంనగర్ అధ్యక్షులు కాళీ చరణ్, పెద్దపల్లి అధ్యక్షులు రవీందర్, సిరిసిల్ల అధ్యక్షులు దేవానంద్ లు హర్షం వ్యక్తం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
వారితోపాటు పలువురు మండల పరిషత్ ఉద్యోగులు కూడా ఎంపీడీవో సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.