ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.

On
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. -  జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)

ప్రపంచ గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రముఖులని మానవ మనుగడకు ఆయన చేసిన సేవలు అమోఘమని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.

జగిత్యాల పట్టణంలోని గౌతమ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం, రామానుజన్‌ జయంతిని పురస్కరంచుకుని విద్యార్థులు తయారు చేసిన గణితశాస్త్ర నమూనాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ...

  • ప్రతి విద్యార్థి శ్రీనివాస రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
  • విద్యార్థులు చిన్నప్పటి నుంచే గణిత శాస్త్రంపై ఆసక్తి పెంచుకోవాలని , ప్రపంచం గర్వించదగ్గ మహామేధావి శ్రీనివాస రామానుజన్‌ అని, మానవ మనుగడ గణిత శాస్త్రంపై ఆధారపడి ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. 

ఈకార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రేణుక-మొగిలి కరస్పాండెంట్ కైలాసం అన్నపూర్ణ ఉపాధ్యాయులు పిల్లలు,పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags