పంచముఖ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దిశగా అడుగులు
ఆలయ చైర్మన్ కాసం రమేష్ గుప్తా
భీమదేవరపల్లి డిసెంబర్ 21 (ప్రజామంటలు) :
జీవితంలో జనన మరణాల మధ్య ఒక చిన్న గీత "జీవితమని" అలాంటి జీవితాన్ని ఆధ్యాత్మిక భావనతో గడపాలని హనుమత్పురి శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ చైర్మన్ కాసం రమేష్ గుప్తా అన్నారు. శనివారం హనుమత్పురిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 2007లో శంకుస్థాపన జరిగినప్పటినుండి దేదీప్యమానంగా వెలుగొందుతూ, భక్తుల మన్ననలు చురగొన్న శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో 12 వ, వార్షికోత్సవం సందర్భంగా, శ్రీ మాధవానంద స్వామి ఆశీస్సులతో, 1001 మహిళలతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని పటిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి వార్షికోత్సవానికి బ్రహ్మోత్సవాలు, స్వామివారి జయంతి, హనుమత్ యాగం లాంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం బాంబే స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సమక్షంలో గతంలో 425 మంది మహిళలతో సామూహికంగా చేసిన హనుమత్ చాలీసా టార్గెట్ ను దాటి ఆలయం అవార్డును సొంతం చేసుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గద్ద సమ్మయ్య, చంద్రశేఖర్ గుప్త తదితర భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.