సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని వెంటనే రెగ్యులరేషన్ చేసి మినిమం పే స్కేల్ అమలు చేయాలి. - డా. బోగ శ్రావణి ప్రవీణ్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) :
ఎన్నికల హామీని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి డిమాండ్ చేశారు.
జగిత్యాల పట్టణంలోని స్థానిక స్థానిక తహాసీల్ చౌరస్తా వద్దగల ధర్నా చౌక్ లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత పది రోజులు నిర్వహిస్తున్న నిరావదిక సమ్మెకు హాజరై సంఘీభావం తెలియజేసిన డాక్టర్ బోగ శ్రావణి.
అనంతరం డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ....
- రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ లో ఏళ్ల నుంచి సేవలందించిన 20 వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని అన్నారు.
- ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సర్వ శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేస్తామని వేతన పెంపు అమలు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు.
- జగిత్యాల నియోజకవర్గం లో ఉన్న ఇద్దరు నాయకులు చట్టసభల్లో ఉన్నారు కానీ వారు మాత్రం సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి కనీసం గొంతు విప్పడం లేదన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు.
- పక్కనే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచి సమ్మె విరమించేలా కృషిచేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాను లేనియెడల భారతీయ జనతా పార్టీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు అన్ని విధాలుగా తోడుగా ఉండి పోరాటాన్ని కొనసాగిస్తామని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, బీర్పూర్ మండల అధ్యక్షులు అడెపు నర్సయ్య, జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులు గదాసు రాజేందర్, పవన్ సింగ్, జగిత్యాల పట్టణ ఇన్చార్జ్ మ్యాదరి అశోక్, బీర్పూర్ మండల ఇంచార్జ్ పాత రమేష్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి,జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షుడు మామిడాల రాజగోపాల్, కాశెట్టి తిరుపతి, మరియు భారతీయ జనతా పార్టీ మండల పట్టణ పదాధికారులు మహిళా మోర్చా నాయకురాలు మరియు తదితరులు పాల్గొన్నారు.