నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తా  మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేస్తా

-సిఎం రేవంత్ రెడ్డి

On
నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తా  మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేస్తా

నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తా 
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేస్తా
-సిఎం రేవంత్ రెడ్డి 

నల్గొండ డిసెంబర్ 07:

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

“ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు.

✅ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 

✅ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇంకా ఏమన్నారంటే...

✅ మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు.

✅ మూసీలో కొట్టుకొచ్చే శవాలు, కళేబరాల నుంచి విముక్తి కలిగించి ఈ జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే విధంగా గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా నదిలో కలిసే వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

✅ నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.

✅ ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలను ప్రవహింపజేసి దేశానికే తలమానికంలా నిలబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.

✅ ప్రపంచంలోనే పొడవైన 44 కిలోమీటర్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలని ఆనాడు ప్రణాళికలు సిద్దం చేశాం.

✅ బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించాం. కానీ గడిచిన పదేళ్ల ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.

✅ ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లాలో ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం.

✅ 21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2400 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది.

✅ 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చాం.

✅ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పరంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదు.

✅ నల్గొండ రింగ్ రోడ్డును పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.

✅ ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్   హుస్నాబాద్ జనవరి 06: హుస్నాబాద్ నియోజవర్గం అక్కన్నపేట్ మండలం రామవరం గ్రామంలో 25 కోట్లతో రామవరం నుండి హుస్నాబాద్ వరకు 11.8 కిలోమీటర్ల సింగిల్ లెన్ రోడ్డు ను డబుల్ రొడ్డుగా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్...
Read More...
Local News  State News 

ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్ 

ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్  బైక్ ఆపకుండా వెళ్లినందుకు ఇంటికి వచ్చి కొట్టిన ఎస్సై  ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్  గొల్లపల్లి  /కొడిమ్యాల) జనవరి 06 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన రాచకొండ రాజేందర్ కొడిమ్యాల ఎస్ఐ సందీప్‌ కుమార్‌ పై సోమవారం  జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం బస్టాండు నుండి ఇంటికి...
Read More...
State News 

ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్ 

ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్  ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలి - కేటిఆర్  హైదరాబాద్ జనవరి 06: రేపు విచారణకి హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకి  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత సమయం కావాలని కోరారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు...
Read More...
National  State News 

HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు 

HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు  HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు  హైదరాబాద్ జనవరి 06: చైనాలో HMPV వ్యాప్తి , భారతదేశంలో తొలి కేసు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఇప్పటివరకు...
Read More...
National  State News 

అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి 

అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి  అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జనవరి 06: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు.  ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11...
Read More...
National  International  

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన రాయ్‌పూర్ జనవరి 06:   సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనంపై మావోయిస్టులు ప్రేరేపించిన భారీ IED పేలుడులో వాహన డ్రైవర్ తో పాటు పది మంది  భద్రతా సిబ్బంది మరణించిన ఈ...
Read More...
National  International  

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన రాయ్‌పూర్ జనవరి 06:   సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనంపై మావోయిస్టులు ప్రేరేపించిన భారీ IED పేలుడులో వాహన డ్రైవర్ తో పాటు పది మంది  భద్రతా సిబ్బంది మరణించిన ఈ...
Read More...
Local News  State News 

3 ,4 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి 

3 ,4 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6( ప్రజా మంటలు ) :  పట్టణములోని 3వ వార్డు లో 20 లక్షల నిధులతో,4వ వార్డు నాగేంద్ర నగర్ లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ అడువాల...
Read More...
Local News  State News 

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను...
Read More...
Local News  State News 

పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). సారంగాపూర్ జనవరి 6 (ప్రజా మంటలు) :  మండలం లోని నాగునూర్ గ్రామంలో 20లక్షల నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామానికి చెందిన నక్కలపెట రవీందర్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :                                        సోమవారం రోజున పట్టణంలోని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను సోమ వారం తనిఖీ చేసినారు.ఈవీఎంల భద్రత ప్రతి నెల చేసే తనిఖీలో భాగంగా సందర్శించడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News  State News 

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, అప్పులు చేసైనా హామీలను అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, అప్పులు చేసైనా హామీలను అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళల్లో భర్తీ చేయని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు....
Read More...