రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు్ కరెంట్ గంగన్న (గంగారెడ్డి) సతీమణి సత్యమ్మ మృతి
ఆదివారం ఉదయం 11గంటలకు నాగోలు లో అంత్యక్రియలు
రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు్ కరెంట్ గంగన్న (గంగారెడ్డి) సతీమణి సత్యమ్మ మృతి
హైదారాబాద్ డిసెంబర్ 14:
జగిత్యాల జిల్లా, కథలాపూరు కు చెందిన సామాజిక నాయకుడు,రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు్ గంగారెడ్డి సతీమణి సత్యమ్మ ఈ రోజు (శనివారం 14న) సాయంకాలం తుది శ్వాస విడిచారు. కొంతకాలం అశ్వస్తులుగా ఉన్నారు. గంగారెడ్డిగారికి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం. వారితో గల 45 ఏండ్ల అనుబంధం జ్ఞాపకాలు హృదయంలో కదలాడుతున్నాయనీ సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు అన్నారు.
ఇంకా, జగిత్యాల లో ప్రారంభమైన అనుబంధం కాల ప్రవాహం మీదుగా హైదరాబాద్ లో కూడా కొనసాగుతూ వస్తున్నది. నా జీవితంలో నిజాం వెంకటేశం, మాధవి దంపతులు, గంగారెడ్డి సత్తక్క దంపతులు విడదీయలేని భాగం అని అన్నారు.
గంగారెడ్డి చొరువతోనే జగిత్యాల 132kv సబ్స్టేశన్ నిర్మాణ జరిగింది. ఆయన తన సర్వీస్ లో దాదాపు 28 సం. కోరుట్ల,మేడిపల్లి, జగిత్యాలలో కొనసాగడంతో, ఆయన ఇంటికి వచ్చే ఎంతో మంది నాయకులకు, రైతులకు సత్యమ్మ ఆదరణ మరువలేనిది. గంగన్నగా పేరొందిన గంగారెడ్డి విజయంలో ఈమె పాత్ర మరువలేనిది
సత్తెక్క గ్రామీణ రైతు కుటుంబం ఆత్మీయ సంస్కృతిని జీవితమంతా కొనసాగించింది . సత్తెక్కకు జోహార్లు. నివాళి. మాజీ మంత్రి జెసి రాజేశం గౌడ్ ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.
రేపు ఆదివారం ఉదయం 11గంటలకు నాగోలు లో అంత్యక్రియలు జరుగుతాయని అన్నారు