జస్టిస్ ఎం. జగన్నాధరావు మృతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
On
జస్టిస్ ఎం.జగన్నాధరావు మృతి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం. జగన్నాధరావు గారి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జగన్నాధరావు పలు కీలక కేసుల పరిష్కారంలో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. జస్టిస్ జగన్నాధరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ కుమారుడు, ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు గారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Tags